గుంటూరు జిల్లా మంగళగిరి అక్షయపాత్రకు 25లక్షల వాహనాన్ని ఇసుజు సంస్థ అందజేసింది. కార్పోరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా సంస్థ ఉపాధ్యక్షులు జగదీష్ సత్యనారాయణ హెగ్డే విజయవాడ అక్షయపాత్ర విభాగం అధ్యక్షులు సత్యగౌర చంద్రదాస్కు వాహనం తాళాలు అందజేశారు. రోజుకి దాదాపు 10వేల మంది పాఠాశాల విద్యార్థులకు భోజనం అందిస్తోందని.. అందులో భాగంగానే ఈ సహాయం చేశామని సత్యనారాయణ హెగ్డే చెప్పారు. త్వరలోనే మరిన్ని రంగాలకు అక్షయపాత్ర సేవలను పొడిగిస్తున్నట్లు చంద్రదాస్ తెలిపారు.
అక్షయపాత్రకు ఇసుజు సంస్థ వాహనం వితరణ - mangalagiri
కార్పొరేటు సామాజిక బాధ్యతలో భాగంగా ఇసుజు సంస్థ మంగళగిరి అక్షయపాత్రకు 25 లక్షల విలువైన వాహనాన్ని వితరణ చేశారు.
అక్షయపాత్ర