ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపే వారిపై... గుంటూరు ట్రాఫిక్ పశ్చిమ సీఐ ఆగ్రహించారు. స్నేక్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, మైనర్ల డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేకపోవటం వంటి అంశాలపై ప్రధానంగా నిఘా పెట్టి వాహనాలను తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. మైనర్లు రోడ్డు నిబంధనలపై అవగాహన లేకుండా వాహనాలతో రోడ్ల పైకి వచ్చి ప్రమాదాలకు కారణమవుతున్నారని వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ప్రధాన రహదారులపై విచ్చలవిడిగా వాహనాలు నడిపేవారి వివరాలను ఫోటోలు, వీడియో ఎవరైన తమకు వాట్సాప్ చేసిన సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే! - undefined
ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా రోడ్డుపై ఇష్టం వచ్చినట్లు వాహనాలను నడిపి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై... గుంటూరు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే
ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు పాటించాల్సిందే
ఇదీ చదవండి:
TAGGED:
vehicals checkings at guntur