ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు వేగేశ్న పౌండేషన్ ద్వారా నరేంద్ర వర్మ... పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. గుంటూరు జిల్లా బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో పంపిణీ ప్రారంభించారు. బాపట్ల నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వరుసగా నాలుగేళ్ల నుంచి విద్యార్థులకు ఉచితంగా నోట్‌బుక్స్ పంపిణీ చేయడం ఆనందంగా ఉందని నరేంద్ర వర్మ తెలిపారు. 222 ప్రభుత్వ పాఠశాలల్లోని 17వేల మంది విద్యార్థులకు లక్షా 20వేల నోట్‌బుక్స్ అందజేస్తున్నామని వేగేశ్న నరేంద్ర వర్మ తెలిపారు.
వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ - వేగేశ్న ఫౌండేషన్
గుంటూరు జిల్లా బాపట్లలో వేగేశ్న ఫౌండేషన్, రాయల్ మెరైన్ సంయుక్తంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేస్తోంది. ఈ కార్యక్రమాన్ని వేగేశ్న నరేంద్ర వర్మ ప్రారంభించారు.
వేగేశ్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నోట్‌బుక్స్ పంపిణీ