ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయండి: వాసిరెడ్డి పద్మ - వాసిరెడ్డి పద్మ తాజా వార్తలు

రాష్ట్రంలో దిశ పోలీస్​స్టేషన్లు పారదర్శకంగా పని చేస్తున్నాయని మహిళా కమిషన్​ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. వేధింపులకు గురవుతున్న మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావాలన్నారు.

వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయండి
వేధింపులకు గురైతే నిర్భయంగా ఫిర్యాదు చేయండి

By

Published : Jun 29, 2020, 3:01 PM IST

మహిళలు వేధింపులకు గురైతే నిర్భయంగా పోలీసులను ఆశ్రయించాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. గుంటూరు దిశ పోలీసు స్టేషన్​ను సందర్శించిన ఆమె..యువతిపై ఇంజనీరింగ్ విద్యార్థులు వేధింపులకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. కూల్​డ్రింక్​లో మత్తు మందు కలిపి ఆపై..అత్యాచారం చేసి ఆ వీడియోలు ఇంటర్​నెట్​లో పెట్టి బెదిరింపులకు పాల్పడటం దారుణమన్నారు. సామాజిక మాధ్యమాల్లో వీడియోను పోస్టు చేసిన వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని స్పష్టం చేశారు. ఐపీ అడ్రస్ దొరకగానే మూడో వ్యక్తిని అరెస్టు చేస్తామన్నారు.

నిందితుల తల్లిదండ్రులు పోలీసు శాఖకు చెందినవారు అయినంత మాత్రాన అపోహపడాల్సిన అవసరం లేదన్నారు. వేధింపులకు గురైన మహిళలకు న్యాయం చేయటానికి దిశ పోలీసు స్టేషన్లను తీసుకొచ్చామన్నారు. నిందితుల పూర్తి వివరాలు సేకరించి త్వరలో ఛార్జ్​షీట్ దాఖలు చేసే విధంగా మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటుందన్నారు. దిశ పోలీసుస్టేషన్లు పారదర్శకంగా పని చేస్తున్నాయని వేధింపులకు గురవుతున్న మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. వారి వ్యక్తిగత వివరాలను గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details