Suicides, Accidents And Murders: సంక్రాంతి పర్వదినం రోజున ఆనందం గడపాల్సిన వారు మాత్రం వాళ్ల ఆలోచనలతో వారి కుటుంబాలను విచారకరంగా మార్చారు. కొందరి జీవితాల్లో మాత్రం ఎవ్వరో తెలియని వ్యక్తులు చేసిన పొరపాట్లకు వారు కుటుంబాలు కుంగిపోయాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోటలో సీఐఎస్‌ఎఫ్ జవాను చింతామణి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి చింతామణి మృతదేహాన్ని పోలీసులు తరలించారు. ఈనెల 10న శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన కేంద్రంలో విధుల్లో జవాన్ చేరాడు.
భార్యను చంపి తాను ఆత్మహత్య:గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకర్రులో దారుణం చోటు చేసుకుంది. భార్య రోజాను భర్త కొట్టి చంపాడు. అనంతరం తాను ఉరేసుకున్నాడు.
10 నెలల కుమార్తెను చంపిన తల్లి:అన్నమయ్య జిల్లాలో రాయచోటి మండలం నక్కలగుట్ట వద్ద అత్యంత దారుణం చోటు చేసుకుంది. 10 నెలల కుమార్తె (రుక్సానా)ను గొంతు నులిమి తల్లి (ఫాతిమా) చంపింది. తండ్రి (మహమ్మద్) బాషా ఫిర్యాదుతో ఘాతుకం వెలుగులోకి వచ్చింది. ఫాతిమాకు అనారోగ్యం, మానసిక సమస్యలతో బాధపడుతుందని తెలుస్తోంది. తనకు ఏదైనా జరిగితే ఎవరూ చూసుకోలేరనే ఆందోళనతో కుమార్తెను చంపిందట. భర్త మహమ్మద్ బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
తనయుడిని హత్య చేసిన తండ్రి:ప్రకాశం జిల్లాలో చీమకుర్తి మండలం భూసరపల్లిలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కుమారుడిని హత్య చేశాడు ఓ తండ్రి. తండ్రి బాబురావు కొడుకు జొన్నలగడ్డ సునీల్ తలపై రాయితో కొట్టడంతో చనిపోయాడు.