మహిళలను కించపరిచేలా మాట్లాడిన మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలపై సీఎం ఎలాంటి చర్యలు తీసుకున్నారని.. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎంతమందిని శిక్షించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో అనూషపై అత్యాచారం జరిగి 7 నెలలైనా, రమ్య హత్య జరిగి 21రోజులు దాటినా.. దిశ చట్టం కింద నిందితుల్ని ఎందుకు శిక్షించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును తిప్పి పంపినా, దిశ చట్టం పేరుతో రాజకీయం చేస్తున్నారని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
VANGALAPUDI ANITHA: 'దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎంత మందిని శిక్షించారు..?' - vangalapudi anitha comments on ysrcp government
దిశ చట్టం ద్వారా రాష్ట్రంలో ఎంత మందిని శిక్షించారో చెప్పాలని తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. దిశ చట్టం కింద రమ్య హత్య కేసులో నిందితుల్ని ఎందుకు శిక్షించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.
vangalapudi anitha
నిర్భయ నిధి కింద కేంద్రం కేటాయించిన రూ.112కోట్లలో కేవలం రూ.38కోట్లే మహిళల భద్రతకు ఖర్చు చేశారని వంగలపూడి అనిత ఆరోపించారు. అత్యాచార బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నారా లోకేశ్, తనపైనా శాంతి భద్రతలు ఉల్లంఘించారని కేసులు నమోదు చేయటం దుర్మార్గమని అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: