గుంటూరు జిల్లా నరసారావుపేటలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ప్రజలందరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి గృహాల ముందు ఒక్క మొక్క అయినా నాటి మొక్కతో పాటు వారి పేరు, చిరునామా, నాటిన మొక్క పేరు నమోదు చేసి సామాజిక మాధ్యమాలలో పొందు పరచాలని సూచించారు. పల్నాడు రోడ్డులోని డివైడర్లపై విద్యార్థి, విద్యార్ధినులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.
నరసారావుపేటలో వన మహోత్సవం - గుంటూరు
గుంటూరు జిల్లా నరసారావుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.
గుంటూరు జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం