విద్యతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ అన్నారు. గుంటూరు జడ్పీ సమావేశ మందిరంలో వాల్మీకి జయంత్యోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విద్య ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని పేర్కొన్నారు. అంబేడ్కర్ వంటి మహనీయులు పుస్తకాల ద్వారా గొప్ప వ్యక్తులుగా మారారని అన్నారు. వాల్మీకి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తోన్న విద్యావకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీలు రామకృష్ణ, లక్ష్మణరావు పాల్గొన్నారు.
వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్ - guntur collector shyamul anand starts valmiki jayanthi
విద్య ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. జిల్లాలోని జడ్పీ కార్యాలయంలో వాల్మీకి జయంత్యోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ విద్యావకాశాలను అందిపుచ్చుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.
![వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4739193-thumbnail-3x2-valgupta.jpg)
వాల్మీకి జయంతి
గుంటూరు వాల్మీకి జయంతి ఉత్సవాలను ప్రారంభించిన కలెక్టర్