ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రతిపక్షాలూ మెచ్చుకునేలా వాజ్​పేయి రాజకీయ జీవితం: కన్నా - గుంటూరులో వాజ్​పేయి వర్ధంతి కార్యక్రమం

మాజీ ప్రధాని వాజ్​పేయీ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. భాజపా ఆధ్వర్యంలో గుంటూరులో దివంగత నేత వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు.

vajpeyee death anniversary in guntur
గుంటూరులో వాజ్​పేయీ వర్ధంతి కార్యక్రమం

By

Published : Aug 16, 2020, 4:16 PM IST

భారత మాజీ ప్రధాని అటల్​బిహారీ వాజ్​పేయి ద్వితీయ వర్ధంతి కార్యక్రమం గుంటూరులో నిర్వహించారు. భాజపా ఆధ్వర్యంలో గుంటూరు పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి కన్నా లక్ష్మీనారాయణ హాజరై వాజ్​పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వశక్తితో పైకి వచ్చిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రతిపక్షాలూ మెచ్చుకునేలా ఆయన రాజకీయ జీవితం సాగిందని తెలిపారు. దేశానికి వాజ్​పేయీ చేసిన సేవలు మరిచిపోలేనివన్నారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో దేశ ప్రజలు ముందుకు సాగాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details