పోలీసుల అదుపులో ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావు - Sankranti Kanuka stampede
13:46 January 02
గుంటూరు తొక్కిసలాట ఘటనలో శ్రీనివాసరావుపై కేసు నమోదు
Uyyuru Foundation Chairman Srinivasa Rao : ఉయ్యూరు ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గుంటూరు తొక్కిసలాట ఘటనలో శ్రీనివాసరావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడలో శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గుంటూరు సిటీ క్రైం పోలీస్ స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోపలికి అందరిని అనుమతించకుండా, కేవలం ఐదుగురు టీడీపీ నేతలను మాత్రమే పోలీసులు అనుమతించారు. పోలీసుల అనుమతి లభించిన వారిలో నక్కా ఆనందబాబు సహా ఇతర టీడీపీ నేతలు ఉన్నారు. ఉయ్యూరు శ్రీనివాస్ ప్రవాస భారతీయుడు కాగా అతని నేతృత్వంలో.. అదివారం కానుకల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కానుకల పంపిణీలో అదివారం తొక్కిసలాట జరగగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పొయారు. పలువురికి గాయాలయ్యాయి.
నల్లపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు : నల్లపాడు పోలీస్స్టేషన్లో ఉయ్యూరు శ్రీనివాస రావుపై కేసు నమోదైంది. గుంటూరు తొక్కిసలాటలో మృతి చెందిన రమాదేవి కుటుంబ సభ్యులు శ్రీనివాసరావుపై నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు శ్రీనివాస రావుపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. అదివారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో మృతురాలు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఇవీ చదవండి: