Bicycle Trip : సైకిల్ యాత్ర చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్నాడు ఓ యువకుడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయగ్రాజ్ ప్రాంతానికి చెందిన సత్యజిత్ పాటక్.. బీసీఏ చదివి వ్యాయమ నిపుణుడిగా పని చేస్తున్నారు. ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేస్తున్నట్లు పాటక్ తెలిపారు. దేశ వ్యాప్తంగా 150 రోజులు పాటు.. 27 వేల కిలో మీటర్లు సైకిల్ యాత్ర చేస్తానని తెలిపారు.
ప్రజల ఆరోగ్యంపై అవగాహన.. ఉత్తరప్రదేశ్ యువకుడి సైకిల్ యాత్ర - యువకుడి సైకిల్ యాత్ర
Bicycle Trip : సాధారణంగా సైకిల్ తొక్కడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా మంది ఇంట్లో ఉండి తొక్కడం లేదా జిమ్‌లకు వెళ్లడం లాంటివి చేస్తుంటారు. కానీ ఈ యువకుడు మాత్రం ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూనే.. గిన్నిస్ బుక్ లక్ష్యంగా సైకిల్ యాత్ర చేస్తున్నాడు.
అక్టోబర్ 27న ప్రయగ్‌రాజ్‌లో యాత్ర మొదలు పెట్టి బీహార్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ మీదుగా రాష్ట్రానికి వచ్చినట్లు తెలిపారు. శ్రీశైలం, తిరుపతి, కన్యాకుమారి మీదుగా యాత్ర సాగుతుందని తెలిపారు. సైకిల్ తొక్కడం వలన ఆరోగ్యం బాగుంటుందని.. ఎముకలు పుష్టిగా ఉంటాయని తెలిపారు. అలాగే కాలుష్యం తగ్గించవచ్చని పేర్కొన్నారు. సైకిల్ యాత్ర చేస్తూ ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కలిపిస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించడమే తన లక్ష్యమని సత్యజిత్ పాటక్ తెలిపారు.
ఇవీ చదవండి: