కొత్తగా వాహనం కొన్నవారు రిజిస్ట్రేషన్ పూరైన తర్వాత ... శాశ్వత నెంబరు కేటాయిస్తారు. అలాగే రిజిస్ట్రేషన్ సమయంలోనే హైసెక్యూరిటీ నెంబర్ ప్లేట్‌కు సంబంధించిన డబ్బు వసూలు చేస్తారు. ఆ నెంబర్ ను హైసెక్యూరిటీ నంబర్ ప్లేట్లు తయారీ సంస్థకు పంపిస్తారు. వారు నంబర్ ప్లేట్ సిద్ధం చేసి వాహనదారులకు సమాచారం ఇస్తారు. సదరు యజమాని వాహనాన్ని తీసుకొచ్చి నంబర్ ప్లేట్ బిగించుకోవాల్సి ఉంటుంది.
అయితే వాహనం కొనుగోలు, రిజిస్ట్రేషన్ పై చూపిన శ్రద్ధ నెంబర్ ప్లేట్లు బిగించుకోవటంలో చూపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీల వద్ద గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన నెంబర్ ప్లేట్లే దీనికి నిదర్శనం. ఒక్క గుంటూరు జిల్లాలోనే 20వేల రవాణా వాహనాలు, 30వేల రవాణేతర వాహనాలు కలిపి... 50వేల మంది వాహనదారులు శాశ్వత నెంబర్ వచ్చి... నెంబర్ ప్లేట్లు సిద్ధమైనా... వాటిని బిగించుకునేందుకు ముందుకు రాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంఖ్య 4లక్షలకు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు.