గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పై అర్బన్ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నగర కమిషనర్ చల్లా అనురాధ మాట్లాడుతూ.. నగరంలోని 14 కేంద్రాల్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
రెండో దశ కోవిడ్ వ్యాక్సినేషన్ కి సంబంధించి ప్రజారోగ్య, ఇంజినీరింగ్ అధికారులను ఇతర శాఖల అధికార్లతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించామన్నారు. కరోనా సమయంలో ముందుండి పనిచేస్తున్న ప్రంట్ లైన్ వారియర్స్‌కు తొలుత వ్యాక్సిన్ చేస్తారని అన్నారు. సమావేశంలో డాక్టర్ వెంకటరమణ, సోషల్ వెల్ఫేర్, విద్యా, కార్మిక ఐసీడీఎస్ శాఖల అధికార్లు పాల్గొన్నారు.