ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సివిల్స్​లో ర్యాంకు సాధించిన సూర్యతేజకు హోంమంత్రి సన్మానం - గుంటూరు జిల్లా వార్తలు

సివిల్స్ లో విజయం సాధించిన సూర్యతేజ..హోంమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సూర్యతేజను సన్మానించి.. హోమంత్రి సుచరిత శుభాకాంక్షలు తెలిపారు.

upsc ranker meet ap home minister
upsc ranker meet ap home minister

By

Published : Sep 18, 2020, 4:00 AM IST

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన 2019 ఫలితాల్లో 76వ ర్యాంక్ సాధించిన సూర్యతేజ.. హోంమంత్రి మేకతోటి సుచరితను కలిశారు. బ్రాడిపేట్​లోని హోంమంత్రి నివాసంలో తన తల్లి, సోదరుడితో కలిసి సూర్యతేజ హోంమంత్రిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. సివిల్స్ లో విజయం సాధించిన సూర్యతేజకు సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. గుంటూరుకు చెందిన సూర్య తేజ పట్టుదలతో సివిల్స్ లో విజయం సాధించారు. సివిల్స్ పరీక్షల్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 34 మంది అభ్యర్థులు సత్తా చాటారు. ఈ విజయాన్ని తన తండ్రికి అంకితం చేస్తున్నట్లు సూర్యతేజ పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details