గుంటూరు జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. చేలల్లో ఉన్న పత్తి, మిరప పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. సత్తెనపల్లి మార్కెట్ యార్డులో వర్షం కారణంగా పత్తి బస్తాలు తడిసిపోయాయి. టార్పాలిన్ పట్టాలతో పత్తిని కప్పినా ఫలితం లేకుండా పోయింది. నిబంధనల ప్రకారం మార్కెట్ యార్డుల్లోనే టార్పాలిన్ పట్టాలు ఉండాలి. కానీ.. సత్తెనపల్లి మార్కెట్ యార్డులో పట్టాలు లేకపోవడం వల్ల రైతులే సొంతగా తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అనుకోకుండా కురిసిన అకాల వర్షంతో తాము చాలా నష్టపోయామని, ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు.
అకాల వర్షం... అన్నదాతకు శాపం...
వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న రైతన్నపై వరుణుడు కన్నెర్ర చేశాడు. కాలం కాని కాలంలో అనుకోని అతిథిగా వచ్చి అన్నదాతను కష్టాల పాలు చేశాడు. గుంటూరు జిల్లాలో కురిసిన అకాల వర్షానికి పత్తి, మిరప పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
అకాల వర్షం... అన్నదాతకు శాపం...
ఇదీ చదవండి:
'వ్యవసాయ రంగ అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం'