ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

CHANDRABABU NAIDU: జడ్‌ ప్లస్‌ భద్రత అంటే ఇదేనా? - ఏపీ 2021 వార్తలు

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు (CHANDRABABU NAIDU) ఇంటి చుట్టూ చీకట్లు అలముకున్నాయి. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుడి ఇంటికి సమీపంలోని మార్గంలో చాలా వరకు వీధిదీపాలు కూడా వెలగట్లేదు. ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే... పై అధికారులకు విషయం చెప్పాం.. వాళ్లు పట్టించుకోవట్లేదని చెబుతున్నారు.

unlit-streetlights-near-chandrababus-house-which-is-judd-plus-security
జడ్‌ ప్లస్‌ భద్రత అంటే ఇదేనా?

By

Published : Sep 26, 2021, 6:56 AM IST

మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు (CHANDRABABU NAIDU) ఇంటి చుట్టూ చీకట్లు అలుముకున్నాయి. ఆ ఇంటికి సమీపంలోని మార్గంలో చాలా వరకు వీధి దీపాలు వెలగడం లేదు. చంద్రబాబు ఇల్లు తాడేపల్లిలోని కట్ట దారికి వంద అడుగుల దూరంలో నది వైపు ఉంది. సుమారు 2 కిలోమీటర్ల పొడవుండే కట్ట దారిలో కొండవీటి వాగు దాటాక కొన్ని లైట్లు మాత్రం వెలుగుతున్నాయి. చంద్రబాబు ఇంటి సమీపం నుంచి మంతెన సత్యనారాయణ ఆశ్రమం వరకు గత నాలుగు రోజులుగా ఒక్క లైటూ వెలగడం లేదు.

భద్రత సిబ్బంది సైతం చీకట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న నాయకుడి ఇంటి వద్ద పరిస్థితి ఇలా ఉండటం స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. కట్ట దారిలో మూడు అంచెలుగా ఉన్న చెక్‌పోస్టుల్లోని సిబ్బందిని ఈ విషయంపై ప్రశ్నించగా.. ‘పై అధికారులకు చెప్పాం.. వాళ్లు పట్టించుకోవడం లేదు’ అని సమాధానం ఇచ్చారు.

ఇదీ చూడండి:Pawan: సినీ పరిశ్రమపై కన్నెత్తి చూస్తే కాలిపోతారు.. వైకాపా నేతలకు పవన్ వార్నింగ్

ABOUT THE AUTHOR

...view details