గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఓ మహిళని అపహరించేందుకు కొందరు యత్నించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సత్తెనపల్లికి చెందిన సెల్వరాణి అనే మహిళ... సతీష్ అనే వ్యక్తితో రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వెన్నాదేవి సమీపంలో వారి బైక్ ఆగిపోయింది. అదేసమయంలో ఆటోలో వచ్చిన కొందరు వ్యక్తులు ఆ మహిళను బలవంతంగా ఆటోలో ఎక్కించి తీసుకెళ్లేందుకు యత్నించారు. సతీష్ అడ్డుకోగా అతనిపై దాడి చేశారు. వెంటనే మహిళ పరిగెత్తుకుని వెళ్లి సమీపంలోని కాలనీవాసులకు చెప్పింది. వారంతా వెంటనే అక్కడికి చేరుకోగా దుండగులు పరారయ్యారు. ఈ విషయంపై పోలీసులకు సమాచారం ఇవ్వటంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై మహిళ ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
సత్తెనపల్లిలో మహిళ కిడ్నాప్‌నకు యత్నం.. - గుంటూరు అపహరణ కేసు
గుంటూరులో మహిళ అపహరణ యత్నం కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో కొందరు దుండగులు ఓ మహిళను బలవంతంగా ఎత్తుకెళ్లే ప్రయత్నం చేశారు. వెంటనే మహిళ పరిగెత్తుకుని వెళ్లి సమీపంలోని కాలనీవాసులకు చెప్పటంతో వారు రక్షించారు. సినీ ఫక్కీలో జరిగిన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
![సత్తెనపల్లిలో మహిళ కిడ్నాప్‌నకు యత్నం.. try to kidnap a women](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10067875-1098-10067875-1609401079261.jpg)
సత్తెనపల్లిలో కలకలం రేపుతున్న అపహరణ యత్నం