ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైల్వే ఫ్లాట్​ఫాం​పై గుర్తు తెలియని వృద్ధురాలు మృతి - thummala cheruvu railway station news

గుంటూరు జిల్లా తుమ్మల చెరువు రైల్వే స్టేషన్ ఫ్లాట్​ఫాం​పై గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని రైల్వే అధికారులు సూచించారు.

unknown old women died
రైల్వే ఫ్లాట్​ఫారమ్​పై గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

By

Published : Sep 17, 2020, 6:29 PM IST

గుంటూరు జిల్లా తుమ్మల చెరువు రైల్వేస్టేషన్ ఫ్లాట్​ఫామ్​పై 60 నుంచి 65 సంవత్సరాల వయస్సు గల గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందింది. మృతురాలు ఎరుపు చీరపై తెల్ల పూలు ఉన్న చీరను.. పసుపు రంగు జాకెట్టు ధరించి ఉందనీ.. ఆమె వద్ద ఓ కండువా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. మృతురాలి వివరాలు తెలిస్తే 7386556482, 7989794742 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details