పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - crime news in guntur
గుంటూరులోని అప్పాపురం గ్రామం అల్లపర్రు పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకువచ్చింది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మృతదేహం 4 ఏళ్ల బాలుడిదిగా గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గుంటూరులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అప్పాపురం గ్రామ సమీపంలోని అల్లపర్రు పంట కాలువలో సుమారు 4 సంవత్సరాల వయసున్న బాలుడి మృతదేహం కొట్టుకువచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే మృతి చెందిన బాలుడు ఎవరు..కాలువలో ప్రమాదవశాత్తు పడి మృతి చెందాడా.. లేక ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడైనా బాలుడు అదృశ్యమైనట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలపాలని కోరారు. బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రేపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి