ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలో కొట్టుకొచ్చిన పసిపాప మృతదేహం.. ఏమైంది..? - baby dead body found at river

గుంటూరు జిల్లా పెనుముడి పుష్కర్ ఘాట్ ఓ పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మరణానికి గల కారణంపై పోలీసులు పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు.

unidentified baby dead body at river
నదిలో కొట్టుకొచ్చిన పసిపాప మృతదేహం

By

Published : Apr 26, 2021, 10:59 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె మండలం పెనుముడి పుష్కర్ ఘాట్ వద్ద గుర్తు తెలియని పసిపాప మృతదేహం లభ్యమైంది. నది ఒడ్డున ఉన్న పసికందు మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహం నదిలో కొట్టుకు వచ్చినట్లు.. ఆ పాప వయస్సు 4-5 రోజులు ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది ఎవరైనా కావాలని చేశారా..? లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం చుట్టు పక్కల ఉన్న వైద్యశాలల్లో సమాచారం సేకరిస్తున్నట్లు సీఐ సాంబశివరావు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details