గుంటూరు జిల్లా నగరం మండలం ఉప్పు కాలువలో గుర్తు తెలియని వృద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. నీటిలో కొట్టుకు వచ్చిన మృతదేహాన్ని స్థానికులు గమనించి స్థానిక వీఆర్వో ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు ఎలా చనిపోయింది, ఎక్కడి వాసి అనే వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలికి సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే తమకు తెలియజేయాలని ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - nagaram uppu canal latest news
గుంటూరు జిల్లాలో గుర్తు తెలియని వృద్ధ మహిళ మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
body