గుంటూరు జిల్లా మాచర్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మండాదికి వెళ్లేదారిలో సగం కాలిపోయిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహం పక్కన పెట్రోల్ డబ్బా ఉండటంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా...? లేదా ఎవరైనా హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మృతికి సంబంధించిన అన్ని విషయాలు తెటతేల్లం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
గుంటూరులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - guntoor
గుంటూరు జిల్లా మాచర్లలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సగం కాలిపోయిన మృతదేహం లభ్యం కావడంతో అతణ్ణి ఎవరైనా చంపారా.. లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం