ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Munugode files రౌండ్ల వారిగా ఫలితాల వెల్లడిలో జాప్యంపై భాజపా నేతల సీరియస్​ - delay in announcing the munugode results

UNION MINISTER KISAHMA REDDY ANGRY : తెలంగాణలో ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు హోరహోరీగా సాగుతోన్నాయి. అయితే ఫలితాల వెల్లడి జాప్యంపై కేంద్రమంత్రి కిషన్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు ఫోన్​చేసి అసహనం వ్యక్తం చేశారు.

UNION MINISTER KISAHMA REDDY ANGRY
UNION MINISTER KISAHMA REDDY ANGRY

By

Published : Nov 6, 2022, 12:30 PM IST

Munugode files తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల రౌండ్ల వారీగా వెల్లడి జాప్యంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌కు ఫోన్ చేసి.. ఎప్పటికప్పుడు ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు . కేంద్రమంత్రి ఫోన్ చేసిన 10 నిమిషాల్లోనే.. 4 రౌండ్ల ఫలితాలను సీఈవో అప్‌లోడ్ చేయించారు.

UNION MINISTER KISAHMA REDDY ANGRY

ఎన్నికల ప్రధాన అధికారిపై బండి సంజయ్​ అనుమానం: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరిపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అనుమానం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వెల్లడిలో సీఈవో అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తెరాసకు లీడ్‌ వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. భాజపాకు ఆధిక్యం లభించినప్పుడు ఫలితాలను వెల్లడించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాల వెల్లడిలో ఎన్నడూ లేనంత ఆలస్యం ఇప్పుడే ఎందుకు జరుగుతోందని సంజయ్ నిలదీశారు.

ఈ క్రమంలోనే మొదటి, రెండు రౌండ్ల తర్వాత మూడు, నాలుగు రౌండ్ల ఫలితాలను అప్‌డేట్‌ చేసేందుకు జరిగిన జాప్యానికి కారణాలేమిటో సీఈవో చెప్పాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు. మీడియా నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తే తప్ప.. రౌండ్లవారీగా ఫలితాలను ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఫలితాల విషయంలో ఏ మాత్రం పొరపాటు జరిగినా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని సంజయ్ హెచ్చరించారు. రౌండ్ల వారీగా ఫలితాలు వెల్లడించడంలో సీఈవో విఫలమయ్యారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి..

ABOUT THE AUTHOR

...view details