ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీ అప్పుల చిట్టాను బయటపెట్టిన కేంద్ర ఆర్థికశాఖ - ap loans

Ap debts
Ap debts

By

Published : Feb 7, 2023, 1:42 PM IST

Updated : Feb 7, 2023, 2:21 PM IST

13:35 February 07

రాష్ట్రానికి ఏటా 45 వేల కోట్ల రూపాయల అప్పులు

Andhra Pradesh Debts : ఏపీ అప్పుల చిట్టాను కేంద్ర ఆర్థికశాఖ మరోసారి బయటపెట్టింది. రాష్ట్రంలో 2019 సంవత్సరంతో పోలిస్తే అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్​ ఏటా సుమారు 45 వేల కోట్ల రూపాయల అప్పులు చేస్తోందని వివరించింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థికశాఖ రాజ్యసభకు వెల్లడించింది. బడ్జెట్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఏపీ అప్పు 4 లక్షల 42 వేల 442 కోట్ల రూపాయలని కేంద్రం వివరించింది. 2019వ సంవత్సరంలో 2 లక్షల 64 వేల 451 కోట్ల రూపాయల అప్పు ఉండగా.. అది 2020లో 3 లక్షల 7వేల 671 కోట్ల రూపాయలకు చేరుకుందని ప్రకటించింది. 2021లో 3 లక్షల 53 వేల 21 కోట్ల నుంచి 2022 సవరించిన అంచనాల తర్వాత 3 లక్షల 93 వేల 718 కోట్ల రూపాయలకు చేరుకుందని కేంద్రం వెల్లడించింది.

2023 బడ్జెట్ అంచనాల ప్రకారం రూ.4 లక్షల 42వేల 442 కోట్ల రూపాయలని కేంద్రం పేర్కొంది. అయితే రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల ఆంధ్రప్రదేశ్​ అప్పుల వివరాలు తెలపాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సమాధానంగా కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్​ చౌదరి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఇవీ చదవండి :

Last Updated : Feb 7, 2023, 2:21 PM IST

ABOUT THE AUTHOR

...view details