గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలోని ఓగేరు వాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకొని వచ్చింది. గుండయ్య తోట వెనుక వాగులో ముళ్ల చెట్ల మధ్య మృతదేహం చిక్కుకుని ఉండగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. గుంటూరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించారు. మృతురాలి వయసు 40 సంవత్సరాలు ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. వాగులో ఎగువ ప్రాంతం నుంచి మృతదేహం కొట్టుకొని వచ్చిందా.. స్థానికంగా ఎవరైనా పొరపాటున వాగులో జారిపడ్డరా... అనే అంశంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
వాగులో కొట్టుకొచ్చిన గుర్తు తెలియని మహిళ మృతదేహం - చిలకలూరి పేట ఓగేరు వాగులో మహిళ మృతదేహం
గుంటూరు జిల్లా చిలకలూరిపేట సమీపంలో ఉన్న ఓగేరు వాగులో శనివారం గుర్తు తెలియని మహిళ మృతదేహం కొట్టుకుని వచ్చింది. పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి... కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
వాగులో కొట్టుకొచ్చిన గుర్తుతెలియని మహిళ మృతదేహం