గుర్తు తెలియని అస్తిపంజరం లభ్యమైన ఘటన గుంటూరు జిల్లా నరసరావుపేట మండల పరిధిలో చోటు చేసుకుంది. అచ్చమ్మ పాలెం శివారులోని ఓగేరు కాల్వలో అస్థిపంజరాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అది కాల్వలోని పొదల్లో ఇరుక్కుపోయి ఉందని తెలిపారు.
ఓగేరు కాల్వలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యం - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలో ఓగేరు కాల్వలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యమైంది. ఇటీవల కురిసిన వర్షాలకు అది కొట్టుకొచ్చి ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఓగేరు కాల్వలో గుర్తు తెలియని అస్థిపంజరం లభ్యం
అస్థిపంజరం ఇటీవల కురిసిన వర్షాలకు కొట్టుకువచ్చి ఉండవచ్చని భావిస్తున్నట్లు నరసరావుపేట గ్రామీణ పోలీసులు పేర్కొన్నారు. క్లూస్ టీమ్ ద్వారా అస్థిపంజరాన్ని ల్యాబ్‌కు పంపించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో తుది దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం