ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా అనుమానితులను వెనక్కి పంపిన వైద్యులు - గుంటూరులో కరోనా అనుమానిత వ్యక్తులకు ఉహించని షాక్

కరోనా అనుమానిత లక్షణాలతో గుంటూరు ఐడీ ఆసుపత్రికి వచ్చిన ముగ్గురు వ్యక్తులను.. పడకలు ఖాళీ లేవనే కారణంతో ఆసుపత్రి సిబ్బంది వెనక్కి పంపారు. ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా అనుమానిత వ్యక్తులకు ఉహించని షాక్
కరోనా అనుమానిత వ్యక్తులకు ఉహించని షాక్

By

Published : Mar 28, 2020, 5:34 AM IST

గుంటూరు ఐడీ ఆసుపత్రిలో కరోనా లక్షణాలు కలిగిన బాధితులకు ఉహించని పరిణామం ఎదురైంది. కరోనా అనుమానిత లక్షణాలతో వచ్చిన మగ్గురుని... పడకలు ఖాళీ లేవని సిబ్బంది వెనక్కి పంపారు. నాలుగు ప్రైవేటు ఆసుపత్రులతో జిల్లా వైద్యాధికారులు ఒప్పందం కుదుర్చుకున్నా... ఇంకా కరోనా ఐసోలేషన్ ప్రారంభం కాలేదు. ఐడీ ఆసుపత్రిలో కేవలం 10 పడకలు మాత్రమే ఉండగా...అవి అప్పటికే నిండిపోయాయి. ఈ కారణంగా ఆ ముగ్గురు రోగులను ఇంటికి వెళ్లాలని వైద్యులు సూచించారు. ఓ వైపు కరోనా చాలా ప్రమాదమని చెబుతూనే...మరో వైపు అందుకు తగిన ఏర్పాట్లు చేయకపోవటంపై బాధిత కుటుంబీకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details