సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసి, రైతులకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టారన్నారు. రాష్ట్రంలోని 50.47లక్షల రైతులకు ప్రతి ఏటా రూ.13,500 జమచేస్తారని అన్నారు. ఈ ఏడాది రెండో విడతలో మరో రూ.2వేలు రైతు భరోసా సాయం అందించినట్లు తెలిపారు. ఏటా ఖరీఫ్, రబీ సీజన్లకు ముందు రైతు భరోసా సొమ్మును అందిస్తామన్న మాటను సీఎం జగన్ నిలబెట్టుకుంటున్నారని శ్రీదేవి కొనియాడారు. రాష్ట్ర చరిత్రలో మొదటి సారి ఖరీఫ్ లో నష్టపోయిన రైతులకు..ఖరీఫ్ సీజన్ లోనే ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.66 లక్షల మంది రైతులకు రూ. 135.7 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం చెల్లించినట్లు ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.
'అన్నదాతలను ఉన్నతమైన స్థానాల్లో ఉంచాలన్నదే సీఎం ఆశయం' - రైతుభరోసాపై ఉండవల్లి శ్రీదేవి వ్యాఖ్యలు న్యూస్
అన్నదాతలను ఉన్నతమైన స్థానాల్లో నిలపాలనేది సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆశయమని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ రెండో విడత సాయం కింద నగదు పంపిణీ సందర్భంగా మెడికొండూరు రైతు భరోసా కేంద్రంలో కార్యక్రమం నిర్వహించారు.
raithula abirudhi prabhutva dheyam