ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజకీయ లబ్ధి కోసమే ఎస్సీలపై చంద్రబాబు కపట ప్రేమ' - చంద్రబాబుపై వైసీపీ నేతల ఫైర్​

గత ప్రభుత్వం హయంలో ఎస్సీలపై అనేక దాడులు జరిగినా స్పందించని చంద్రబాబు.. నేడు రాజకీయ లబ్ధి కోసమే.. ఎస్సీలపై కపట ప్రేమ చూపిస్తున్నారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రతిపక్షాల తీరును నిరసిస్తూ గుంటూరు లాడ్జి సెంటర్​లో అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.

http://10.10.50.85:6060/reg-lowres/31-August-2020/ap-gnt-22-31-mla-sridevi-fire-on-babu-avb-ap10169_31082020123636_3108f_1598857596_466.mp4
http://10.10.50.85:6060/reg-lowres/31-August-2020/ap-gnt-22-31-mla-sridevi-fire-on-babu-avb-ap10169_31082020123636_3108f_1598857596_466.mp4

By

Published : Aug 31, 2020, 3:33 PM IST

ఎస్సీలకు రాజధానిలో ఇళ్ల స్థలాలు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీలకు అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అమరావతిని భ్రమరావతిగా తీర్చిదిద్దిన ఘనత చంద్రబాబుది అని పేర్కొన్నారు. ఇన్​సైడ్ ట్రేడింగ్ చేసి వేల కోట్లు దోచుకున్నారన్నారని ఆమె ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details