ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేను ఎస్సీ కాదని నిరూపిస్తే.... ఏ చర్యలకైనా సిద్ధం: ఎమ్మెల్యే శ్రీదేవి - ycp mla

తెదేపా నేతలు కులవివక్ష చూపుతున్నారని తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆరోపించారు. తాను ఎస్సీ కులస్థురాలు కాకపోతే తదుపరి చర్యలకు కట్టుబడి ఉంటానన్నారు. రాజధాని ప్రాంతంలో గతంలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నందుకే తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.

నేను ఎస్సీ కాదని నిరూపిస్తే....ఏ చర్యలకైనా సిద్ధం : ఎమ్మెల్యే శ్రీదేవి

By

Published : Sep 5, 2019, 11:50 PM IST

నేను ఎస్సీ కాదని నిరూపిస్తే....ఏ చర్యలకైనా సిద్ధం : ఎమ్మెల్యే శ్రీదేవి

తెదేపా నేతలు కులవివక్ష చూపుతున్నారని గుంటూరు జిల్లా తాడికొండ శాసనసభ్యురాలు ఉండవల్లి శ్రీదేవి ఆరోపించారు. గుంటూరులోని వైకాపా కార్యాలయంలో ఆమె మాట్లాడారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా తెదేపా నేతలు వ్యవరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో గతంలో జరిగిన అవినీతిని బయట పెడుతున్నందుకే తనపై కక్షసాధింపు చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. వర్ల రామయ్య, తంగిరాల సౌమ్య చేసిన వ్యాఖ్యలను శ్రీదేవి తప్పుపట్టారు. తాను ఎస్సీ కులస్థురాలు కాదని నిరూపిస్తే తదుపరి చర్యలకు కట్టుబడి ఉంటానని సవాల్ విసిరారు. తనపై కులవివక్షత చూపడం మానుకోవాలని హితవు పలికారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details