ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మందు కావాలా బాబూ...అయితే గొడుగుతో రా.. - మందు గొడుగులతో బారులు తీరిన జనం వార్తలు

ఒకే దెబ్బకు రెండు పిట్టలంటే ఇదేనేమో.. మందు బాబులు ఎంత చెప్పినా వినకుండా మందు కోసం నియమాలకు మరిచి భౌతిక దూరం పాటించకుండా ఎగబడుతున్నారు. దీంతో గుంటూరు జిల్లాలో మందు కొనేవారికి గొడుగు తప్పనిసరి చేశారు అధికారులు. ఈ నిబంధనతో ఇటు భౌతిక దూరం పాటించండం, అటు ఎండకు రక్షణ సైతం దొరుకుతుంది. దీంతో మందుబాబులు ఎంతో క్రమశిక్షణగా గొడుగులతో మందు షాపుల వద్ద బారులు తీరారు.

umbrella in must to drinkers to buy a Liquor
మందు గొడుగులతో బారులు తీరిన జనం

By

Published : May 6, 2020, 7:47 AM IST

Updated : May 6, 2020, 9:31 AM IST

గుంటూరు జిల్లా తాడికొండనియోజకవర్గం పిరంగీపురం మద్యం దుకాణాలలో మద్యం కొనుగోలు చేసందుకు మందుబాబులు గొడుగులతో బారులు తీరారు. లాక్ డౌన్ కారణంగా 45 రోజులుగా దుకాణాలు మూసి వేశారు. మొదటి రోజు దుకాణాలు తెరిచే సమయానికి కొనుగోలుదారులు నిబంధనలు పాటించకుండా మందు కోసం ఎగబడ్డారు. దీంతో కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని భౌతిక ధురం పాటించాలనే ఉద్దేశంతో మందు కావాలంటే గొడుగును తప్పనిసరి చేశారు. ఈ నిబంధనతో ఇటు భౌతిక దూరం పాటించినట్లు అవుతుంది. అటు ఎండలో మాడిపోకుండా రక్షణగా కూడా పనిచేస్తుంది. దీంతో మందు కోసం వచ్చేవారు కూడా గొడుగుతో షాపుల ముందు బారులు తీరుతున్నారు.

Last Updated : May 6, 2020, 9:31 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details