గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం బసికాపురం గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. మలతోటి వెంకీ బాబు, వేమర్తి ఏసుబాబు బసికాపురం గ్రామం నుంచి నరసరావుపేటకు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు.
ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ.. ఇద్దరి మృతి - గుంటూరులో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టిన లారీ
ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం నరసరావుపేట మండలం కేసానుపల్లి ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.
అనంతరం కేసానుపల్లి గ్రామ సమీపంలోని పెద్ద తురకపాలెం ఈద్గా వద్దకు చేరుకున్న క్రమంలో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ.. ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఫలితంగా ఇద్దరు యువకులు రోడ్డుపై పడి తీవ్ర రక్తస్రావంతో ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. యువకుల మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృత దేహాల వద్దకు చేరుకుని రోధిస్తున్న తీరు చూపరులను కంటతడిపెట్టించింది.
ఇవీ చూడండి :సగం కాలిన మృతదేహం లభ్యం.. దర్యాప్తు చేస్తోన్న పోలీసులు