ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి - గుంటూరు జిల్లాలో నిటీలో పడి ఇద్దరు యువకులు గల్లంతు
సరదగా ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు దుర్మరణంపాలైన ఘటన గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో చోటు చేసుకుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
![ఈతకు వెళ్లి ఇద్దరు యువకుల మృతి Two young men killed after swimming](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6418287-26-6418287-1584272442158.jpg)
ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
గుంటూరు జిల్లా నంబూరు గ్రామంలో సరదగా ఈతకు వెళ్లినా ఇద్దరు యువకులు నీటిలో మునిగి గల్లంతయ్యారు. కంతేరు గ్రామానికి చెందిన బుల్లా మాధవ్ కుమార్, నంబూరు గ్రామానికి చెందిన సిద్దార్థ ఇద్దరు స్నేహితులు. వీరిద్దరు ఇంటర్ వరకు చదువుకున్నారు. గుంటూరు ఛానల్లో ఈతకు వెళ్లిన ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందినట్లు పెదకాకాని ఎస్సై నరసింహరావు తెలిపారు.