ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను గుంటూరు జిల్లా రేపల్లె మండలం చోడాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈనెల 21న చోడాయపాలెం గ్రామంలో బైక్ చోరీ అయ్యిందని ఓ బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. పెనుమూడి గ్రామం వద్ద అనుమానాస్పదంగా వెళ్తున్న నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై కొండారెడ్డి తెలిపారు. చోరీకి గురైన వాహనాలు రేపల్లె, చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాలలోనివని పోలీసులు వెల్లడించారు.
ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న ముఠా అరెస్ట్.. - two wheeler thefting gang
ద్విచక్రవాహనాలు చోరికి పాల్పడుతున్న ముఠాను చోడాయపాలెం పోలీసులు అరెస్ట్ చేశారు. నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు.. వారి వద్ద నుంచి 13 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన వాహనాలు రేపల్లె, చీరాల, బాపట్ల పరిసర ప్రాంతాలలోనివని పోలీసులు వెల్లడించారు.

ద్విచక్రవాహనాల చోరికి పాల్పడుతున్న దొంగల ముఠా అరెస్ట్