గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో.. పండగ రోజు ఒక కుటుంబంలో విషాదం నెలకొంది. మంగళగిరి మండలం నూతక్కిలో దేవాలయం వద్ద జరిగే కార్యక్రమానికి అవినాష్, అతని కుమారుడు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. గుడి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు ఏర్పాటు చేసిన తాడుని వారు గమనించక పోవడంతో ద్విచక్ర వాహనం కిందపడింది. ఈ ప్రమాదంలో అవినాష్ మృతి చెందాడు. అతని కుమారుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రాణం తీసిన తాడు... ద్విచక్ర వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి - guntur two wheeler accidents
గుడి వద్ద రోడ్డుకు అడ్డంగా కట్టిన తాడు.. ఓ వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమైంది. గుడి వద్ద ట్రాఫిక్ నియంత్రణకు తాడు ఏర్పాటు చేశారు. దానిని గమనించకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లి కింద పడి మృతి చెందాడు.
![ప్రాణం తీసిన తాడు... ద్విచక్ర వాహనంపై నుంచి పడి వ్యక్తి మృతి nutakki accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9311815-293-9311815-1603670919020.jpg)
రోడ్డు ప్రమాద బాధితుడు