క్రిమిసంహారక మందు తాగి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆత్మహత్య చేసుకున్నారు. కుష్ఠు వ్యాధిగ్రస్తులిద్దరు గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఐదు లాంతర్ల సెంటర్ వద్ద భిక్షాటన చేస్తూ, చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. కుంగదీసే కుష్ఠు వ్యాధి... మీద పడుతున్న వయసు ఒత్తిడి తోనే ఆత్మహత్య చేసుకొని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బతకలేకే బలవన్మరణానికి పాల్పడి ఉంటారని సందేహిస్తున్నారు.
పట్టణంలోని వాసవి అమ్మవారి దేవాలయం పక్కన ఉన్న ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పురుగులమందు తాగి మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.