గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కరోనా వైరస్ బారిన పడి ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందారు. బడెపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు కిషోర్ కుమార్ (48), సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు నరసమ్మ (50) కరోనా లక్షణాలతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఇవాళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.
కరోనాతో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి - గుంటూరులో కరోనాతో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి
గుంటూరు జిల్లా తాడికొండ మండలంలో కరోనా మహమ్మారి ఇద్దరు ఉపాధ్యాయులను బలి తీసుకుంది. వైరస్ బారిన పడి ఉపాధ్యాయులు కిషోర్ కుమార్, నరసమ్మ ప్రాణాలు విడిచారు.
కరోనాతో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి