ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆలయ పుష్కరిణిలో బయటపడిన పురాతన శివలింగాలు - శివలింగం

Shivalingam: మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పుష్కరిణిలో రెండు శివలింగాలు బయటపడ్డాయి. పుష్కరిణి అభివృద్ధి కోసం రెండు నెలల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. నీటిమట్టం కొంచెం తగ్గిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం బయట పడింది. పూడిక తీస్తుండగా.. సమయంలో నిన్న శివలింగాలు కనిపించాయి. అర్చకులు వీటికి పాలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుతో పాటు పలువురు నేతలు దర్శించుకున్నారు.

శివలింగాలు
శివలింగాలు

By

Published : Feb 9, 2023, 12:17 PM IST

Shivalingam: దక్షిణ భారతంలో ప్రసిద్ధి గాంచిన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో మంగళగిరి శ్రీలక్ష్మీ నృసింహస్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయ పుష్కరిణిలో రెండు శివలింగాలు బయట పడ్డాయి. పుష్కరిణి అభివృద్ధి కోసం రెండు నెలల నుంచి నీటిని బయటకు తోడుతున్నారు. ఈ క్రమంలో నీటిమట్టం కొంచెం తగ్గిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయం బయట పడింది.

సుమారు నెల రోజుల నుంచి పూడిక పనులు తీస్తున్న సమయంలో బుధవారం రెండు శివలింగాలు బయట పడ్డాయి. వీటికి పాలతో అభిషేకించిన ఆలయ అర్చకులు.. తర్వాత పూజలు నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి పూజలు చేశారు. ఈ కోనేరులో మరో 25 అడుగుల నీరు ఉంది.

వీటిని తోడేలోపు మరిన్ని శివలింగాలు బయట పడే అవకాశం ఉందని అర్చకులు చెబుతున్నారు. వీటిని చూడటానికి భక్తులు తరలి వచ్చారు. నీటిని బయటకు తోడేసిన తర్వాత పుష్కరణిలోకి భక్తులు వచ్చి పూజలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తామని ప్రజాప్రతినిధులు చెప్పారు.

శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పుష్కరిణిలో బయటపడిన శివలింగాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details