చోరీలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరు దొంగలను గుంటూరు సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో దొంగతనాలకు పాల్పడిన వారిని.. మంగళగిరి మండలం చినకాకానిలో పట్టుకున్నారు. వారి నుంచి బంగారం, భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దొంగలు నుంచి వివరాలు రాబట్టేందుకు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
గుంటూరులో ఇద్దరు దొంగల అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం - robbers arrest news
దొంగతనాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఇద్దరిని గుంటూరు సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
![గుంటూరులో ఇద్దరు దొంగల అరెస్ట్.. బంగారం, నగదు స్వాధీనం Two robbers arrested](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10174611-626-10174611-1610167105065.jpg)
ఇద్దరు దొంగల అరెస్ట్