గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దర బలవన్మరణానికి పాల్పడ్డారు. విజయలక్ష్మి రోటరీ కళ్యాణ మండపానికి సమీపంలో నివాసం ఉంటున్న దుర్గారెడ్డి శుభకార్యాలకు వంటలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యకు దూరంగా ఒంటరిగా ఉంటున్న దుర్గారెడ్డి మనస్థాపంతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య - రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన ఘటన గుంటూరు జిల్లా బాపట్లలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబాలకు దూరంగా ఉండటమే ఆత్మహత్యలకు కారణంగా తెలుస్తోంది.
![రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7499096-653-7499096-1591425533386.jpg)
రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్య
మరో ఘటనలో యల్ఐసీ కార్యాలయానికి సమీపంలో నివాసం ఉంటున్న షేక్ నాగులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు.