గుంటూరు నగరం బ్రాడీపేటలోని గోల్డెన్ పార్క్ హోటల్‌లో ఇద్దరు వ్యక్తులు గొంతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఉదయం 10 గంటల సమయంలో ఒక పురుషుడు, మహిళా ఇద్దరూ కలసి హోటల్లో గదిని అద్దెకు తీసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. అరగంట తరువాత వాళ్ల గది నుంచి కేకలు వినిపించాయి. దీంతో హోటల్ సిబ్బంది గదిలోకి వెళ్లి చూసేసరికి.. ఇద్దరి గొంతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వాళ్లను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అరండల్ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వివాహేతర సంబంధం నేపథ్యంలో దాడి జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ నరేష్ బాబు తెలిపారు.