గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. పొగాకు మిల్లులో పనికి వచ్చిన యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి యత్నించారు. యువతి కాలకృత్యాలు తీర్చుకునేందుకు మిల్లు వెనక వైపునకు వెళ్లగా...అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఆమె వెంటనే కేకలు వేయగా.. మిల్లులో పని చేస్తున్న తోటి కూలీలు పరుగున వచ్చారు. నిందితులను పట్టుకుని దేహశుద్ధి చేశారు. పోలీసులకు అప్పగించారు.
యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారయత్నం - గుంటూరులో యువతిపై అత్యాచారం న్యూస్
రాష్ట్ర ప్రభుత్వం దిశ-2019 చట్టం బిల్లును తీసుకొచ్చినా.. మహిళలపై నేరాలు ఆగడం లేదు. గుంటూరులో ఇద్దరు ప్రబుద్ధులు మహిళపై అత్యాచారానికి యత్నించారు.
two persons rape attempt on girl in gunturu