accident: బైకును ఢీకొట్టిన లారీ... ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం - గుంటూరు జిల్లా గణపవరం దగ్గర బైక్‌ను ఢీకొట్టిన లారీ
20:42 August 24
గుంటూరు జిల్లా గణపవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం వద్ద 16వ నంబర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. చిలకలూరిపేటలోని గడియార స్తంభం ప్రాంతానికి చెందిన పల్లపు శీను, రమణయ్య అనే ఇద్దరు.. గుంటూరు నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తున్నారు. గణపవరం ప్రగతి ఫంక్షన్ హాలు వద్ద వెనుక నుంచి వచ్చిన లారీ.. వాళ్ల ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న నాదెండ్ల పోలీసులు.. ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి..