గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో ప్రమాదం జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై బైక్‌ను లారీ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కారంపూడికి చెందిన ఇద్దరు యువకులు తమ స్నేహితులను కలిసేందుకు ద్విచక్రవాహనంపై రొంపిచర్లకు వచ్చారు. వారిని కలిసి తిరిగి కారంపూడి వెళ్తుండగా సంతగుడిపాడు గ్రామం వద్ద... ఎదురుగా ఇసుక లోడ్‌తో వస్తున్న లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. వాహనంపై ఉన్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108కు ఫోన్ ద్వారా సమాచారమందించి క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంతగుడిపాడు వద్ద ప్రమాదం... ఇద్దరికి తీవ్రగాయాలు - గుంటూరు జిల్లా సంతగుడిపాగు వద్ద బైక్‌ను ఢీ కొన్న లారీ
గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామంలోని ప్రధాన రహదారిపై బైక్‌ను లారీ ఢీ కొనడంతో ఇద్దరు యువకులకు తీవ్రగాయాలయ్యాయి. గాయలపాలైనవారిని స్థానికులు నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సంతగుడిపాగు వద్ద బైక్‌ను ఢీ కొన్న లారీ