గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్ కు చెందిన నాగశశిధర్ అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఉరేసుకుని ఒకరు.. పురుగులమందు తాగి మరొకరు ఆత్మహత్య - crime news tenali
ఒకేరోజు ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఘటనలు తెనాలిలో చోటుచేసుకున్నాయి.
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్
తెనాలి గురవయ్య కాలనీ కి చెందిన శ్రీనివాస్ (30) అనే మరో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తల మధ్య గొడవలే ఆత్మహత్యకు కారణమని స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకేరోజు ఇద్దరు ఆత్మహత్య చేసుకోవటంతో పట్టణ వాసులు ఉలిక్కిపడ్డారు.