బాపట్లలో వదిన, మరిది బలవన్మరణం - people
బాపట్లలో వదిన, మరిది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇరువురి మృతిపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేశారు. స్థానిక వైద్యశాలకు మృతదేహాలను తరలించారు పోలీసులు.

two-people-suicide-in-bapatla
బాపట్లలో వదిన, మరిది బలవన్మరణం
గుంటూరు జిల్లా బాపట్లలో వదిన,మరిది బలవన్మరణానికి పాల్పడ్డారు.వెంగళ్ విహార్‌కు చెందిన నక్క సునీత,ఆమె మరిది నక్క జోష్ బాబు ఆత్మహత్య చేసుకున్నారు.సునీతకు మూడేళ్ల కిందట ఏలియాతో వివాహమైంది.పిల్లలు లేరనే మనస్తాపంతో ఆమె ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు.తర్వాత ఆమె మరిది జోషు బాబు కూడా మరణించాడు.ఇరువురు మృతి చెందడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.స్థానిక వైద్యశాలకు మృతదేహాలను పోలీసులు తరలించారు.