ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

current shock: విద్యుదాఘాతంతో ఇద్దరు మృతి - గుంటూరు జిల్లా ముఖ్యంశాలు

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో రెండు వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కేసులు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

రేపల్లె నియోజకవర్గంలో విద్యుదాఘాతంలో ఇద్దరు మృతి
రేపల్లె నియోజకవర్గంలో విద్యుదాఘాతంలో ఇద్దరు మృతి

By

Published : Jul 8, 2021, 8:04 PM IST

గుంటూరు జిల్లా రేపల్లె నియోజకవర్గంలో వేర్వేరు చోట్ల విద్యుదాఘాతానికి గురై ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. నగరం మండలం సిరిపుడి గ్రామానికి చెందిన ద్వారాపు బాబు రెడ్డి (57).. ఇంటి ప్రక్కన ఉన్న చేతిపంపు కొడుతూ ఉండగా.. ప్రమాదవశాత్తూ పంపునకు ఉన్న మోటార్ ద్వారా విద్యుత్ ప్రవాహించి కరెంట్ షాక్ కొట్టింది. ఈఘటనలో బాబు రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

మరోవైపు నిజాంపట్నం మండలం అడవుల దీవి పంచాయతీకి చెందిన గౌస్.. తన పొలంలో ఇంకుడు గుంత తీస్తుండగా నీళ్లు తోడే మోటార్ తీగ తగలి విద్యుత్ షాక్​కు గురయ్యాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే గౌస్ మృతి చెందాడు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details