గుంటూరులోని చుట్టుగుంట ప్రాంతానికి చెందిన ఓ యువతికి మేడికొండూరు మండలం పేరేచర్ల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహం జరిగింది. వీరిరువురికి మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో మహిళకు పెదకూరపాడుకు చెందిన అక్బర్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.
వివాహితపై అత్యాచారం... ఇద్దరు అరెస్టు - guntur district crime news
వివాహితపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసులు తెలిపారు. వీరిని రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు.
మేడికొండూరులో వివాహితపై అత్యాచారం
ఈ క్రమంలో వివాహిత, అక్బర్ ఇద్దరూ సిరిపురం రోడ్డు వద్దకు వెళ్లారు. కొద్దీ సేపటి తర్వాత అక్బర్ మిత్రుడు షేక్ మీరావలి అక్కడకు వచ్చాడు. వీరందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం అక్బర్, అతని స్నేహితుడు షేక్ మీరావలి తనపై అత్యాచారం చేశారంటూ వివాహిత పోలీసులకు తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని అక్బర్, మీరావలిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీచదవండి.