నరసరావుపేటలో మరో రెండు పాజిటివ్ కేసులు - narasaraopeta corona virus news
గుంటూరు జిల్లా నరసరావుపేటలో మరో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది.
నరసరావుపేటలో తాజాగా మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన నివేదికలో జిల్లాలో కొత్తగా 13 పాజిటివ్ కేసులు నిర్థరణ కాగా వాటిలో 2 కేసులు నరసరావుపేటలో నమోదయ్యాయి. ఫలితంగా తాజా కేసులతో కలిపి పట్టణంలో పాజిటివ్ కేసుల సంఖ్య 192కి చేరింది. నమోదైన 2 కేసులు శ్రీనివాసనగర్ కు చెందినవని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీనివాసనగర్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పట్టణంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.