ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అల్లూరివారిపాలెం హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ - latest news on alluvaripalem

ఈ నెల 11వ తేదీన అల్లూరివారిపాలెంలో జరిగిన కోనూరి హరికిరణ్ చౌదరి హత్య కేసులో నరసరావుపేట పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు.

అల్లూరివారిపాలెం హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

By

Published : Sep 27, 2019, 11:28 PM IST

అల్లూరివారిపాలెం హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం అల్లూరివారిపాలెం గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన కోనూరి హరికిరణ్ చౌదరి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అదే గ్రామానికి చెందిన చెరుకూరి సాంబశివరావు, ఉడతా వెంకయ్య చౌదరిలను అరెస్ట్ చేసి... వారి నుంచి కత్తులు, మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు నరసరావుపేట గ్రామీణ సీఐ వై.అచ్చయ్య తెలిపారు. మరో నిందితుడు ఉడతా పోతురాజును త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. పాతకక్షల నేపథ్యంలోనే హత్య జరిగిందన్నారు. ఈ హత్య కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details